టబి ఆర్ఎస్ నాయకున్ని చంపిన 9 మంది అరెస్ట్

టబి ఆర్ఎస్ నాయకున్ని చంపిన 9 మంది అరెస్ట్

Aug 11, 2023 - 20:21
Aug 11, 2023 - 20:23
 0  17.8k
టబి ఆర్ఎస్ నాయకున్ని చంపిన 9 మంది అరెస్ట్

తేదీ: (RNI) రోజున ఉదయం అందాజా 9 గంటలకు అందరూ చూస్తుండగా కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా కి ఎదురుగా ఉన్నటువంటి శంకర్ టీ స్టాల్ నందు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్ ధరించి టీ తాగడానికి వచ్చిన స్థానిక కోరుట్ల కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజంపై కత్తులతో ఒక్కసారిగా దాడి చేసి మోటార్ సైకిల్ పై పారిపోయినారు. గాయాల పాలైన లక్ష్మీరాజంను కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా  అదే రోజు  అందాదా 11:00 గంటలకు  చనిపోయినాడు. మృతుని భార్య  పోగుల ఉమారాణి  ఇచ్చిన ఫిర్యాదు మేరకు విత్తనాల నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తులు, పిల్లి సత్యనారాయణ, కాసుల వంశీ అను నలుగురు వ్యక్తులపై  కోరుట్ల PS లో  కేసు నమోదు చేశారు. అట్టి కేసును చేదించడానికి జగిత్యాల SP ఆదేశానుసారం మెట్పల్లి DSP గారి ఆధ్వర్యంలో ఇద్దరు  CIలు,5 గురు  SI లతో 7  బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తుండగా ఈరోజు ఉదయం అందాజా 04:00 సమయంలో విత్తనాల నాగరాజు యొక్క కారులో పారిపోతున్న విత్తనాల నాగరాజు , విశాల్, వంశీ, మధు,  దీపక్ @ సిద్దులను అదుపులో తీసుకొని విచారించగా హత్య చేయడానికి గల కారణాలు మరియు హత్యకు వాడిన ఆయుధాల గురించి  పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది.  

విత్తనాల నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తి, పిల్లి సత్యనారాయణ, వంశీ, విశాల్, మధుమోహన్, దీపక్ @ సిద్దు, ప్రభాస్ లు మొత్తం ఎనిమిది మంది కలిసి భూదందా మరియు ల్యాండ్ సెటిల్మెంటులలో ప్రజలకు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భయం కలిగించి ల్యాండ్ సెటిల్మెంట్లు చేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకు పట్టణంలో పేరున్న వ్యక్తిని అందరూ చూస్తుండగా రోడ్ మీద  చంపినట్లైతే ప్రజలలో నాగరాజు తన అనుచరులంటే భయం కలుగుతుందని ఆ తరువాత కోరుట్ల పట్టణంలోని ఏ సెటిల్మెంట్ అయినా తామే చేయవచ్చని అందుకు లక్ష్మీరాజం సరైన వ్యక్తిగా ఎంచుకొని గత నెల 30వ తారీఖు రోజున వంశీ వాళ్ళ ఇంటి మీద దావత్ చేసుకొని ఏ విధంగా చేయాలని పథకం పన్నారు. వారి పథకంలో భాగంగా నరసింహ అనే వ్యక్తి లక్ష్మీరాజం యొక్క కదలికలను గమనిస్తూ నాగరాజుకు చేరవేయవలసినదిగా సరైన సమయము స్థలము చూసి   నాగరాజు కు చెప్పినట్లయితే నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తులు లక్ష్మీరాజం ని చంపితే అట్టి హత్యను పిల్లి సత్యనారాయణ త్రిమూర్తులు తామే చేసినట్టుగా పోలీసులకు లొంగిపోవాలని  అందుకు నాగరాజు వారికీ  1  లక్ష రూపాయలు, కొంత భూమిని ఇచ్చే విధంగా ఒప్పుకున్నాడు. అందుకు సహకరించిన మిగిలిన వారికి కూడా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు సర్దుతానని చెప్పినాడు. అందుకు అందరు కూడా ఒప్పుకున్నారు. 
 తమ పథకంలో భాగంగా తేది: 08-08-2023 రోజున ఉదయం అందాజా 9 గంటలకు శంకర్ హోటల్ కు టీ తాగడానికి వచ్చిన లక్ష్మీరాజం ను గమనించి నరసింహ వాట్సప్ కాల్ ద్వారా నాగరాజుకు తెలియజేయగా నాగరాజు అతని తమ్ముడు త్రిమూర్తి ఒకే బైక్ పై వచ్చి నాగరాజు కత్తితో దాడి చేస్తుండగా అతని తమ్ముడు తనని తీసుకుపోవడానికి మోటార్ సైకిల్ తో రెడీగా ఉన్నాడు అట్టి సమయంలో విశాల్, పిల్లి సత్యనారాయణ ఒకవైపు ఒక బైకు పైన , వంశీ అతని తమ్ముడు మధుమోహన్  మరో బైక్ పైన, దీపక్ @ సిద్దు, ప్రభాస్ లు మరో బైక్ పై మూడు వైపులా లక్ష్మీరాజం వారి నుండి పారిపోకుండా చూస్తుండగా నాగరాజు లక్ష్మీరాజం పై కత్తితో దాడి చేసినాడు వెంటనే అక్కడి నుంచి వంశీ వాళ్ళ పొలం దగ్గర 9మంది కలుసుకొని వారి పథకంలో భాగంగా అక్కడి నుంచి పిల్లి సత్యనారాయణ ,త్రిమూర్తులు కలిసి లక్ష్మీరాజo ను చంపినారని పోలీసు వారికి అనుమానం వచ్చే విధంగా ఉండాలని పల్సర్ పై అక్కడ నుంచి పారిపోయినారు అనంతరం హత్య చేస్తుండగా అక్కడే ఉండి చూసినవారు నాగరాజు ను గుర్తుపట్టారని తెలుసుకొని   లక్ష్మీ రాజo ను చంపడానికి ఉపయోగించిన కత్తులను మరియు హత్య రోజు వారు ఉపయోగించిన మోటార్ సైకిల్ లను వంశీ వాళ్ళ పొలం దగ్గర దాచిపెట్టి మిగిలిన వారు కూడా పోలీస్ వారికి దొరకకుండా దాక్కొని ఈరోజు ఉదయం మరల కోరుట్ల పట్టణం మీదుగా పారిపోతుండగా  కోరుట్ల పట్టణ సీఐ ప్రవీణ్  తన సిబ్బందితో నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.
 మృతుని హత్యపై అతని బంధువులు మరికొంతమంది పై అనుమానo వ్యక్త పరుస్తున్నారు అట్టి అనుమానానికి సంబంధించి మరికొంతమందిని విచారించవలసిన అవసరం ఉన్నది దానితో పాటుగా మరికొంత  సాంకేతిక సమాచారం సేకరించవల్సిన  అవసరం ఉంది అట్టి సమాచారం సేకరించిన అనంతరం  తదుపరి విచారణ కొనసాగించి ఇట్టి కేసు లో  ఎంత మంది నిందితుల యొక్క ప్రమేయం ఉన్నదని నిర్దారించావాల్సి ఉంది దానికి గల కారణాలు పూర్తి ఆధారాలతో సహా సేకరించి  హత్య చేయడానికి గల సరైన కారణం, అందుకు సహకరించిన అందరి నిందితులన పూర్తి వివరాలతో సహా పట్టుకొని విచారించి కోర్ట్ నందు ప్రవేశపెట్టి తదుపరి విచారణ చేయడం జరుగుతుంది.  
నిందితుల పూర్తి వివరాలు:
1: Vithanala Nagaraju s/o Potharaju, 40yrs R/o Jhanshi road N/at Ramnagar, Korutla, 
2:Vithanala Thrimurthi @Thrimurthulu s/o Potharaju, 38-yrsR/o Jhanshi road N/at  Prakasham     road, Korutla
 3:Kasula Vamshi  Prasad S/o Gangareddy. Age: 24yrs, R/o I.B Road of korutla N/at  Balaji Road      of Korutla .
4:Pilli Sathyanarayana S/o Ramulu, Age:41yrs,   R/o  Durgamma wada of Mallapur Village &    Mandal, 
5:Gudla Vishal S/o Pundarikam Age:26yrs, R/o Urban colony  of Korutla N/at Muthylawada of         Korutla.
6:Kasula Madhu Mohan S/o Gangareddy, Age:23-yrs,R/o I.B Road of korutla N/at  Balaji Road    of Korutla 7: Martha Narsimhulu S/o Bapu Age: 29yrs, R/o Prakasham Road of Korutla..
8: Sriramula Dipak S/o Ashok, Age:21-yrs, R/o Balaji Road of Korutla, 
9:Marupaka Prabhas S/o Anjaiah, Age;18yrs, r/o Balaji Road of Korutla n/at  Ramnagar of Korutla
నిందితుల నుండి స్వాధీనం పరచుకున్న వస్తువులు :
1)    5 కత్తులు 
2)    4 మోటార్ సైకిల్ లు 
3)    8 సెల్ ఫోన్లు
4)    1 కార్ 
ఇట్టి కేసును అతి తక్కువ సమయం లో మెటుపల్లి  DSP గారి ఆధ్వర్యంలో చేదించిన కోరుట్ల CI, మెటుపల్లి 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

211
211